VIDEO: ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా అంకురార్పణ
KMM: ముదిగొండ మండలం యడవల్లి శ్రీ లక్ష్మీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.4.75 కోట్లు విడుదల చేసింది. కాగా ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గురువారం ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. దేవదాయ శాఖ అధికారులు, ఆలయ నూతన పాలకవర్గం ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.