గ్రీన్ ఛానెల్ విజయవంతం.. 20 నిమిషాల్లో 35 కిలోమీటర్లు
HYD: హైదరాబాద్ పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. బెంగళూరు నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఊపిరితిత్తులను, అత్యవసర చికిత్స కోసం గ్రీన్ ఛానెల్ ద్వారా కేవలం 20 నిమిషాల్లో 35 కిలోమీటర్ల దూరంలోని కిమ్స్ ఆసుపత్రికి చేర్చారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక ప్రాణాన్ని కాపాడిన హైదరాబాద్ పోలీసుల కృషిని అందరూ అభినందిస్తున్నారు.