అద్దె బస్సులను ప్రోత్సహిస్తున్న ఆర్టీసీ అధికారులు

MBNR: ఉమ్మడి జిల్లాలో 10 ఆర్టీసీ డిపోల పరిధిలో మొత్తం 842 బస్సులు ఉన్నాయి. వీటిలో సంస్థకు చెందినవి 477, మిగిలినవి అద్దె బస్సులు 365.. MBNR, NRPT డిపోల్లో సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుల కంటే అద్దె బస్సులు ఎక్కువగా ఉన్నాయి. అద్దె బస్సులు అయితే, డ్రైవర్ల నియామకాలు అవసరం లేదని, బస్సుల నిర్వహణ కూడా యజమానులే చూసుకుంటారని మండిపడుతున్నారు.