'ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి'
E.G: రాజమండ్రిలోని మల్లయ్య పేట ప్రాంతంలో ఇసుక లారీల రాకపోకల వల్ల స్థానికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని రాజమండ్రి మాజీ MP మార్గాని భరత్ మండిపడ్డారు. బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో స్థానికలతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు. వేగంగా వెళ్లే ఇసుక లారీల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అధికారులు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.