జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన రెండు రోజుల్లోనే 155 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కారణంగానే ఈ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.