జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా
SRD: ఉద్యోగులకు మూడు నెలల బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో డాక్టర్ శశాంక్ దేశ్పాండేకు వినతి పత్రం సమర్పించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రహమాన్ మాట్లాడుతూ.. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.