ఘనంగా వెంకన్న కళ్యాణోత్సవం
నెల్లూరు: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి చంద్రగ్రహణం అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.