రేపు నకరికల్లులో విద్యుత్ సరఫరా నిలిపివేత

రేపు నకరికల్లులో  విద్యుత్ సరఫరా నిలిపివేత

PLD: నకరికల్లు మండలంలో రెండో శనివారం నిర్వహణ పనుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని సబ్ స్టేషన్ పరిధిలో 33 కేవీ, 11 కేవీ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వినియోగదారులు సహకరించాలని సూచించారు.