అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరులో ఇవాళ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి 'అన్నదాత సుఖీభవ' (పీఎం కిసాన్) పథకం రెండో విడత నిధులను రైతుల ఖాతాలలోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో, సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి రూ. 20,000 అందించే ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, అందులో భాగంగానే ఈ నిధులు విడుదలయ్యాయని తెలిపారు.