చినకాకానిలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కమిషనర్

చినకాకానిలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కమిషనర్

GNTR: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని చినకాకాని హాయ్ ల్యాండ్ రోడ్డులో ఓ యువకుడికి డెంగ్యూ సోకిన నేపథ్యంలో కమిషనర్ అలీమ్ బాషా సోమవారం అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయించారు. మురుగునీరు నిలిచిపోవడం వల్ల దోమలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారు.