'దొంగతనానికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటాం'

'దొంగతనానికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటాం'

NTR: వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జరిగిన చోరీ ఘటన ప్రాంతాన్ని ఆదివారం డీసీపీ లక్ష్మీనారాయణ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరలోనే దొంగలను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. దొంగతనాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.