'రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలి'

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ సముదాయాన్ని ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీ బిడ్‌లో కైవసం చేసుకుంది. ఈ అడ్డంకులను అధిగమించి సముదాయాన్ని దక్కించుకున్న ఉద్యోగ సంఘాల నాయకులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందించారు. శుక్రవారం కలెక్టర్‌ను కలిసిన నాయకులకు, రాష్ట్రంలోనే ప్రత్యేక ఒరవడి కలిగిన ఈ ప్రాజెక్టును విజయవంతం చేసి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ తెలిపారు.