కొల్లిపర ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి పర్యటన

కొల్లిపర ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి పర్యటన

GNTR: కొల్లిపరలోని వరద ముంపు గ్రామాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం పర్యటించారు. ఆయనతో పాటు జడ్పీ ఛైర్‌పర్సన్ క్రిస్టినా, నాయకులు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో పర్యటించిన ఆలపాటి, వరద ముంపునకు గురైన పొలాలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్నారు.