అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు: సర్పంచ్

అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు: సర్పంచ్

BHPL: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని మహదేవ్పూర్ మండలం ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ తెలిపారు. 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఇవాళ గ్రామ సభ జరిగింది. సర్పంచ్ సభలో పాల్గొని మాట్లాడారు. గ్రామస్థాయి సమస్యలకు పరిష్కారం అయ్యేందుకు ఈ సభలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.