నేడు విద్యుత్ నిలిపివేత

KMM: బోనకల్ మండలం కలకోట ఫీడర్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ మనోహర్ తెలిపారు. 11KV లైన్ మరమ్మతుల కారణంగా రాపల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిచిపోతుందన్నారు. ఈ విషయాన్ని ఫీడర్ పరిధిలో ఉన్న ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.