VIDEO: లారీ ఢీకొని.. యువకుడు మృతి
HNK: కమలాపూర్ మండల కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇవాళ గ్యాస్ సిలిండర్ లారీ ఎదురుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు రాజును (30) ఢీ కొట్టింది. ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడు గట్లకానిపర్తి గ్రామం, శాయంపేట మండల వాసిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.