ముగ్గురికి గాయాలు..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

నల్గొండ 13వ వార్డులో గిరికబావి గూడెంలో వీధికుక్కల దాడిలో మహిళా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పందుల శ్రీదేవిపై కుక్క దాడి చేయగా, ఆమెను హుటాహుటిన హైదరాబాదులోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అదే కాలనీలో చిన్నారులు విహాన్, వీరేశం కుక్కల దాడిలో గాయపడి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేపథ్యంలో మాజీ MLA భూపాల్ రెడ్డి బాధితులను పరామర్శించారు.