రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ASF: రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడిన ఘటన సిర్పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ (T) మండలం పారిగాం గ్రామం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఏడ్ల బండిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.