వనభోజనాలకు తరలిన ఎమ్మార్పీఎస్ నేతలు

KNR: సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు కుటుంబ సమేతంగా గురువారం వనభోజనాలకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పాడిపంటలు, పిల్లాపాపలు చల్లగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మొలుగూరి తిరుపతి, వెంకటయ్య, కొమురయ్య, లచ్చయ్య, రామస్వామి, సమ్మయ్య పాల్గొన్నారు.