కష్టపడిన ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు

కష్టపడిన ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు

AKP: టీడీపీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందని ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. అచ్యుతాపురం పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు నాయకులు కృషి చేయాలన్నారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.