విజయవాడ ప్రకాశం బ్యారేజి బోట్ టూర్
NTR: విజయవాడలోని ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణానదిలో బోట్ టూర్ అందుబాటులో ఉంది. పర్యాటకులు బోట్‌లో కృష్ణానది సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. భద్రత కోసం లైఫ్ జాకెట్లు అందిస్తారు. ఈ బోట్ రైడ్ విజయవాడ పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణగా మారింది. పర్యాటకులకు సురక్షితమైన, అద్భుతమైన అనుభవాన్ని అందిస్తోంది.