VIDEO: పోలీసుల ముందే యువకుల స్టంట్లు..!
RR: అత్తాపూర్ ప్రాంతంలో ఇద్దరు యువకులు పోలీసుల ముందే ప్రమాదకర స్టంట్‌లకు పాల్పడ్డారు. పెట్రోలింగ్ వాహనం ముందు బైక్ ఫ్రంట్ టైర్ ఎత్తి వీలింగ్ చేస్తూ కుప్పిగంతులు వేశారు. మరో వ్యక్తి ఈ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వెంబడించి యువకులను పట్టుకున్నారు. అనంతరం డీసీపీ సమక్షంలో వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.