VIDEO: "నామినేషన్ల ప్రక్రియ సాఫీగా పూర్తి చేయాలి"
ADB: గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇచ్చోడ, సిరికొండ మండలంలోని గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.