బీహార్ ఎన్నికల వేళ.. ఢిల్లీలో పేలుడు కలకలం

బీహార్ ఎన్నికల వేళ.. ఢిల్లీలో పేలుడు కలకలం

బీహార్‌లో ఇవాళ చివరి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈనెల 6న 121 నియోజకవర్గాలకు తొలిదశ ఎన్నికలు జరగ్గా.. ఇవాళ 122 నియోజకవర్గాలకు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోటకు 500 మీటర్ల దూరంలో ఉన్న మెట్రోస్టేషన్ వద్ద బాంబు పేలుడు ఘటన యంత్రాంగాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.