బైకు బోల్తా.. యువకుడి మృతి

KKD: తుని మండలం వేలంపేట హైవేపై ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కిర్లంపూడికి చెందిన బోడే దుర్గాప్రసాద్ (25) ప్రాణాలు కోల్పోయాడు. తేటగుంట నుంచి తుని వైపు బైక్‌పై ఇద్దరు వెళ్తున్నారు. బైకు టైరు పంక్చర్ అవ్వడంతో బైకు అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న దుర్గాప్రసాద్ రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయమై మృతి చెందాడు.