మహా కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: పామూరు పట్టణంలో కొలువైన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మహా కుంభాభిషేక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను ఆశీర్వదించిన పండితులు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.