గుత్తి కోర్టుకు హాజరైన సినీ నటుడు రాజ్ కుమార్
ATP: 2009 సాధారణ ఎన్నికల ప్రచారంలో అనుమతి లేకుండా హైవేపై రోడ్డు షో నిర్వహించారనే కేసులో సినీ నటుడు, టీడీపీ నేత రాజ్ కుమార్ ఇవాళ గుత్తి కోర్టుకు హాజరయ్యారు. గతంలోనూ ఒకసారి కోర్టుకు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏప్పుడు నష్టం చేయదని అండగా ఉంటుదని పేర్కొన్నారు. అనంతరం పలువురు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.