VIDEO: ఆసుపత్రి వద్ద పోలీసుల భారీ బందోబస్తు
KMM: భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ లింగారెడ్డి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనతో ఖమ్మంలోని ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న కార్మికులు భారీగా అక్కడికి చేరుకోగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సంఘటనపై పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.