క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు: సీపీ

HNK: ఎవరైన క్రికెట్, ఇతరత్ర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని వరంగల్ సీపీ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువత బెట్టింగ్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా మంగళవారం ఓ ప్రకటన చేశారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత బెట్టింగ్ చేస్తున్నారని అన్నారు.