'దివ్యంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'
ADB: తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. దివ్యాంగులతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు కాలి నడకన ర్యాలీ నిర్వహించారు.