VIDEO: కుక్కల దాడిలో....దూడ మృతి

ADB: తాంసి మండలంలో కుక్కల దాడిలో ఒక దూడ మృతి చెందింది. బాధిత రైతు వివరాల ప్రకారం.. మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన రైతు రాజేష్ గౌడ్‌కు చెందిన దూడ పుట్టిన 24 గంటల్లోనే శనివారం ఉదయం కుక్కలు దాడి చేయడంతో మరణించింది. పశు పోషణతోనే జీవనాధారం అని రైతు ఆవేదన వ్యక్తంచేశారు. సంబంధిత అధికారులు స్పందించి కుక్కలను అరికట్టాలని కోరుతున్నారు.