అంగన్వాడీ టీచర్‌ను చెట్టుకు బంధించి వేధింపులు

అంగన్వాడీ టీచర్‌ను చెట్టుకు బంధించి వేధింపులు

SRD: కంగ్టి మండలం రాసోల్‌లో దారుణం జరిగింది. అంగన్‌వాడీ టీచర్ వసంతకుమారిని ఐదుగురు వ్యక్తులు చెట్టుకు బంధించి వేధించారు. ఆమె భర్త ఓ ఫైనాన్స్ పేరుతో తమను మోసం చేశాడని ఆరోపిస్తూ అవుటి బండేప్ప, మరికొందరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుర్గారెడ్డి తెలిపారు. మహిళపై జరిగిన ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది.