పశువుల సంతలో రూ.21 కోట్ల విలువైన గేదె మృతి

పశువుల సంతలో రూ.21 కోట్ల విలువైన గేదె మృతి

రూ.21 కోట్ల విలువ చేసే గేదె పశువుల సంతలో చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో నిర్వహించిన ప్రసిద్ధ పుష్కర్ పశువుల సంతలో వివిధ జంతువుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన రూ.21 కోట్ల విలువైన ఓ గేదె అకస్మాత్తుగా కిందపడి చనిపోయింది. ఈ విషయాన్ని ఓ జంతు సంరక్షణ సంస్థ SMలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.