సిబ్బంది కొరతతో తెలంగాణ డయాగ్నస్టిక్ సేవల్లో ఆలస్యం..!
HYD: కోరంటి తెలంగాణ డయాగ్నస్టిక్‌లో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా మారుతోంది. దీంతో PHC, UPHC కేంద్రాల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నప్పటికీ, వారాల తరబడి పరీక్షా రిపోర్టులు అందకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడంతో, త్వరగా పరీక్షలు చేయడానికి వీలు కావడం లేదని సమాచారం.