నా సినిమానే 'తేరి' కోసం వాడారు: హరీష్ శంకర్
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విజయ్ దళపతి 'తేరి' మూవీకి రీమేక్ కాదని దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. మొదట రీమేక్‌గా భావించినా, తర్వాత కథను పూర్తిగా మార్చేశామని స్పష్టం చేశాడు. కథ, మాటలు, దర్శకత్వం తనవే అయినప్పుడు రీమేక్ అనడం సరికాదన్నాడు. 'గబ్బర్ సింగ్'లోని అంశాలే 'తేరి'లో కనిపించాయని, ఇప్పుడు తన సినిమానే రీమేక్ అనడంపై ఆయన అసహనం వ్యక్తం చేశాడు.