VIDEO: 'ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలి'
NZB: ప్రజలకు సేవ చేయాలనే ప్రగాఢ సంకల్పంతో ముందుకు సాగాలని అర్బన్ MLA ధన్‌పాల్ సూర్యనారాయణ పిలుపు నిచ్చారు. నిజామాబాద్ శివారులోని బోర్గం (పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సులో MLA మాట్లాడారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో అందరిని భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.