బ్రహ్మ సాగర్‌లో పడి మహిళ మృతి

KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని సోమిరెడ్డి పల్లి గ్రామ పంచాయితీ లోని నరసన్నపల్లి గ్రామానికి చెందిన మడక లక్ష్మీదేవి బ్రహ్మంగారి మఠం మండల సమీపములోని బ్రహ్మ సాగర్‌లో దూకి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.