వైసీపీ డిజిటల్ కోఆర్డినేటర్‌గా అప్పలరాజు
AKP: పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ డిజిటల్ కోఆర్డినేటర్‌గా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామానికి చెందిన పెన్నాడ అప్పలరాజు నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కమిటీ అప్పలరాజును నియమించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని అప్పలరాజు అన్నారు.