హిందూపురంలో కొత్త రోడ్లు, కాలువల పనుల పరిశీలన

హిందూపురంలో కొత్త రోడ్లు, కాలువల పనుల పరిశీలన

సత్యసాయి: హిందూపురం పట్టణం 37వ వార్డు ముద్దిరెడ్డిపల్లిలో కొత్తగా నిర్మించిన రోడ్లను మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. అలాగే పాండురంగ నగర్, మేళాపురం, ముబారక్ నగర్, భవాని నగర్ ప్రాంతాల్లో కొత్త రోడ్లు, కాలువల నిర్మాణానికి సంబంధించిన స్థలాలను పరిశీలించారు. ఈ పనులతో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.