సిలిండర్ ధర పెంపు సమంజసం కాదు: సీపీఎం

సిలిండర్ ధర పెంపు సమంజసం కాదు: సీపీఎం

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని 60 అడుగుల రోడ్డులో సీపీఎం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఉపాధి కోసం తోపుడు బళ్ళు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్న వారిపై వాణిజ్య సిలిండర్ ధర పెంపు సమంజసం కాదని వారు అన్నారు. ఇప్పటికే నిత్యవసర వస్తువులు పెరిగి సామాన్య మానవులపై సతమతమవుతున్న తరుణంలో వంటగ్యాస్ ధర పెంచడం, పేదలను ఇబ్బంది పెట్టటం సరికాదన్నారు.