విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన సదస్సు

విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన సదస్సు

PDPL: ముత్తారం తెలంగాణ మోడల్ స్కూల్‌లో పెద్దపల్లి షీ టీమ్ ఇన్‌ఛార్జ్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సభ్యురాలు స్నేహలత మహిళల భద్రత, యాంటీ డ్రగ్స్, 'గుడ్ టచ్-బ్యాడ్ టచ్', ఆన్‌లైన్ మోసాలపై వివరించారు. వేధింపులు ఎదురైతే 6303923700 లేదా 100 నంబర్‌కు కాల్ చేయాలని, సైబర్ మోసాలపై 1930కి సమాచారం ఇవ్వాలని సూచించారు.