గుండెపోటుతో రైతు మృతి
TPT: కీలపూడి పంచాయతీకి చెందిన రైతు పి. రామకృష్ణారెడ్డి నిన్న సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు.