'నీటి కొరత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి'
SKLM: ఆమదాలవలస మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీవో రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో "జలధార-జలహారతి" కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ మేరకు నీటి సంరక్షణ చర్యలు, తాగునీటి పంపిణీ, వర్షపు నీటి నిల్వ విధానాలు వంటి అంశాలపై చర్చించారు. గ్రామ స్థాయిలో నీటి కొరతను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సూచించారు.