‘పోలియో చుక్కలు తప్పనిసరి’
VZM: ఈనెల 21న నిర్వహించే పల్స్ పోలియో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాజాం మున్సిపల్ కమిషనర్ రామచందర్రావు సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ANMలతో సమావేశం నిర్వహించారు. 0-5 సం.ల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ ఆదివారం ఉచితంగా పోలియో చుక్కలు వేసి, పోలియో వ్యాధి నుంచి పిల్లలను రక్షించాలని కమిషనర్ తెలిపారు.