కడియం సొసైటీ చైర్మన్‌గా నాని ప్రమాణ స్వీకారం

E.G: కడియం వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) కొత్త చైర్మన్‌గా వెలుగుబంటి నాని శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నాని కడియం మండల పరిషత్ ఉపాధ్యక్షులు, ఉప సర్పంచ్, మండల టీడీపీ అధ్యక్షుడిగా అద్భుతమైన సేవలు అందించారని ఎమ్మెల్యే కొనియాడారు.