అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.. నిందితుడు అరెస్ట్

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.. నిందితుడు అరెస్ట్

NRPT: మద్దూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన ప్రకారం.. బి. వెంకటేశ్ గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యం సేకరించి కర్ణాటకకు తరలిస్తుండగా పల్లెర్ల శివారులో పట్టుబడ్డాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.