VIDEO: “ఓటు అమ్ముకోను”.. టీ షాప్ యజమాని సందేశం వైరల్

VIDEO: “ఓటు అమ్ముకోను”.. టీ షాప్ యజమాని సందేశం వైరల్

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో బుధవారం టీ షాప్ యజమాని వినూత్న ఆలోచన అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తన దుకాణం వద్ద “నేను టీ అమ్ముతాను కానీ ఓటును అమ్ముకోను” అనే పోస్టర్‌ను అతికించి, డబ్బులకు ఓటు అమ్ముకోవద్దని ప్రజలకు సందేశం ఇచ్చాడు. ఓటుహక్కు పవిత్రమని గుర్తుచేసే ఈ ప్రయత్నం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.