శాంతిపురంలో నవ వధువు ఆత్మహత్య

CTR: శాంతిపురం మండల కేంద్రంలోని శివాలయం వీధిలో నివాసం ఉంటున్న పవిత్ర అనే వివాహిత ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని టి.కొత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యం రెండు నెలల కిందట ఒడిశాకు చెందిన పవిత్రను వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.