చిన్నారులు బాగా చదువుకోవాలి: జడ్జి అనిత
NLG: దేవరకొండ మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చందంపేట మండలం పోలేపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చిన్నారులందరికీ నోటుబుక్స్ కిట్స్ తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ సహకారంతో గురువారం పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ కె. అనిత పాల్గొని చిన్నారులకు అందజేశారు. చిన్నారులు బాగా చదువుకోవాలన్నారు.