ఉదారతను చాటుకున్న పూర్వ విద్యార్థులు
NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తి పాఠశాల 2002-03 పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ ఉదారతను చాటుకున్నారు. మోర్సుగూడెం గ్రామానికి చెందిన తమ తోటి విద్యార్థిని సుర్కంటి శోభ భర్త ఇటీవల మరణించడంతో, ఆమెకు అండగా నిలిచారు. పాత మిత్రులంతా కలిసి రూ. 60,000 ల నగదును సేకరించి ఆమెకు అందజేశారు. ధైర్యం చెప్పి, భవిష్యత్తులోనూ తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు.